
ఈనెల 11న భువనగిరిలో నిర్వహించే జ్యోతిరావు పూలే 198వ జయంతిని బీసీలంతా హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి విజ్ఞప్తి చేశారు బుధవారం బోనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ నెల మాసమును మహనీయుల జయంతి మాసంగా, దేశవ్యాప్తంగా బహుజనులంతా ఒక పండుగ వాతావరణములో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటారని తెలిపారు 11న జ్యోతిరావు పూలే 198వ జయంతిని, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీలంతా, పార్టీలకతీతంగా బీసీ ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ,మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.. తమ తమ మండల కేంద్రాల్లో పట్టణాల్లో గ్రామాల్లో బీసీలంతా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మార్టూరు అశోక్, బీసీ సంఘం మండల అధ్యక్షులు అశోక చారి, మాజీ కౌన్సిలర్ దేవరకొండ నరసింహ చారి, బీ డిఎఫ్ నాయకులు మెరుగు మధు, కొత్త బాలరాజు, మచ్చ నరసింహ గౌడ్, శివ, పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు పట్టణంలోని రెండో వార్డ్ రాంనగర్ మజీద్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్య కార్మిక సంఘం చైర్మన్ సామల ధర్మరాజు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు బిస్కుంట్ల సత్యనారాయణ, కైరం కొండ వెంకటేశు, మహమ్మద్ అన్వర్ అలీ, మహమ్మద్ లతీఫ్ ఆలీ, మహమ్మద్ మొబీన్ ఆలీ, మహమ్మద్ మూయిజ్ ఆలీ, నీలా సతీష్, లింగాల ఆంజనేయులు, సామల అజయ్ కుమార్ పాల్గొన్నారు.