
ఏటూర్ నాగారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడ్వాయి మండల ఎస్టి సెల్ మండల అధ్యక్షులు మంకిడి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వడ్డెర సంఘం స్టేట్ సెక్రటరీ తుర్క వీరబాబు, కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు మర్రి నరేష్ లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం శాలువాతో సన్మానం చేసి, ఇర్సవడ్ల వెంకన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవకుడు, వెంకన్న పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓర్సు రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.