8న కేరళ ప్రజలకు సఘీభావంగా జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయండి

– కల్లూరి మల్లేశం  సీఐటీయు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి
కేరళపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 08 న జరిగేస సంఘీభావ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు  విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో సీఐటీయు మండల కన్వీనర్ ల సమావేశం సీఐటీయు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు, కల్లూరి మల్లేశం లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల,పేదల  పక్షాన పనిచేస్తున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అక్కడి గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అనేక బిల్లులను అనుమతించకుండా బీజేపీ కార్యకర్తల గా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తూన్నరని విమర్శించారు.  కేంద్రం నుండి రావాల్సిన రాష్ట్ర వాటాను ఇవ్వకుండా కేరళ ఇబ్బందులకు గురిచేస్తుందనీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. అన్ని రాష్ట్రాలలోనూ కార్మికులపైన ప్రభావం ఉంటుందని అందుకే కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 8న అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం  కార్యక్రమంలో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా కోశాధికారి దోనూరు నర్సిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శి బోడభాగ్య, సుబ్బూర్ సత్యనారాయణ, మండల కన్వీనర్లు తోటి వెంకటేష్ సామ శ్రీనివాస్ రెడ్డి, పోతార బోయిన సత్యనారాయణ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.