
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఈనెల 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని భారత గ్రామీణ బందుతో మోడీని గద్దె దించడం ఖాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారంనిజామాబాద్ సీఐటీయూ కార్యాలయంలో ఫిబ్రవరి 16న జరిగే సమ్మె పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.ఒకవైపు కార్మికుల హక్కులను చట్టాలను తుంగలోకి తొక్కుతూ మరోవైపు రైతులను వ్యవసాయ కార్మికులను వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక పాలనను అవలంబిస్తున్న నరేంద్ర మోడీని గద్దె దింపేందుకు కార్మికులు కర్షకులు ఐక్యంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధును విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు మతం అనే మత్తుమందు చల్లి నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం అమలు కోసం కార్మికులకు సామాజిక భద్రత కోసం అదేవిధంగా రైతులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు కలిసి విజయవంతం చేయాలని కోరారు. గతంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీకి బుద్ధి చెప్పే లాగా రైతులందరూ ఐక్యంగా ఉద్యమించి మోడీ మెడలు వంచిన విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక చట్టాలను దొంగలకు తొక్కి బీజేపీ ప్రభుత్వానికి గద్దె దింపితినే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంతోమంది కార్మికులు ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానం కూడా బిజెపి సర్కార్ కాల రాయాలని చూస్తుందని భవిష్యత్తులో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేసేందుకు సీఐటీయూ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాయక్ వాడి శ్రీనివాస్ కటారి రాములు, కృష్ణా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.