– ప్రారంభోత్సవ కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలో నిర్మించిన బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సీఐటీయూ జిల్లా కార్యాలయాన్ని ఈనెల 28న ప్రారంభించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తెలిపారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు బృందాకారత్ మాజీ పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు, మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత హాజరవుతున్నట్లు వెల్లడించారు. కార్మిక పోరాటాల సారథి ఐక్య ఉద్యమాలవారధి కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యాలయం ప్రారంభమనేది జిల్లా కార్మిక వర్గానికి పండుగ లాంటిదన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయం ప్రభుత్వాల కార్మిక ప్రజాకర్షక వ్యతిరేక విధానాల పైన పోరాడే వారికి కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. భవిష్యత్తు జిల్లా కార్మిక వర్గ ఉద్యమాలకు వేదికగా నిలబడుతుందని అన్నారు. ప్రారంభోత్సవ సభకు కార్మికులు ప్రజలు కర్షకులు ఆదివాసీలు కార్మిక ఉద్యమ శ్రేయోభిలాషులు వేలాది సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, కోశాధికారి కే సునీత, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, వెంకటమ్మ, ఎన్ శోభ, లింగాల చిన్నన్న, ముఖినేపల్లి గంగన్న, అగ్గిమల స్వామి, సహాయ కార్యదర్శిలు ఎం సుజాత, పి జితేందర్, నాయకులు పండుగ పొచ్చన్న, దర్శనాల నగేష్, సోనేరావు, జనార్ధన్, వెంకట్రావు, ఆశన్న పాల్గొన్నారు.