– మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కేంద్రం ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల16 న చేపడుతున్న సమ్మె ను జయప్రదం చేయాలనిమున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, చైర్మన్ ఆకుల రజిత లకు కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. సందర్బంగా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవి కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ కార్మిక సంఘాలు, వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక) ఈ నెల 16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతో పాటు గ్రామీణ భారత్ బంద్ పాటించాలని నిర్ణయించారన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, సంఘాలకు అనుబంధ యూనియన్ గా ఉన్న మేము తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) స్థానిక సంస్థల్లో భాగమైన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని, పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలని కోరుతూ ఈ జాతీయ సమ్మెలోభాగస్వాములమౌతున్నామని అన్నారు .ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్-పే కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుండే ప్రతినెలా వేతనాలు చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా రూ.24,500/-ల వేతనం చెల్లించాలన్నారు. 11వ పిఆర్సి కమిషన్ ఛైర్మన్ సిఫారసు చేసిన వేతనాలను జీఓ నెం.60 ప్రకారం రూ.19,000/-లు, రూ.22,900/-లు, రూ.31,040/- లను కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలన్నారు. జి.హెచ్.ఎం.సిలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.24,000/లు ఇవ్వాలన్నారు.పారిశుద్ధ్య సేవల్లో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాంకీ తదితర ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. కొత్తగా నియమించుకున్న కార్మికులను పాత కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. దహన సంస్కారాలకు రూ.30,000/-లు ఇవ్వాలని, ఆదివారాలు, పండుగ సెలవులు, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు. వాటర్ వర్క్స్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబుల్ బెడ్రూం, ఇండ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సారయ్య, నాయకులు ప్రభాకర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.