
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఈనెల 25న ఆలేరు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పార్టీ బోనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు పిలుపునిచ్చారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండి జహంగీర్ గత 35 సంవత్సరాలుగా మార్క్సిస్టు పార్టీలో ఉంటూ అనేక ప్రజా సమస్యలను పరిష్కరించారాని అన్నారు. నీతి నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే దినచర్యగా నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటున్న జహంగీర్ ను అత్యధికంగా ఓట్లు వేసి పార్లమెంట్లోకి పంపాలని ఆయన కోరారు. భువనగిరి గడ్డ ఉద్యమాలకు అడ్డ అని పోరాటాలు నిర్వహించే వారికి ఓట్లు వేయాలని కోరారు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను ద్వారా దత్తం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, నాయకులు బబ్బురి శ్రీనివాస్ వడ్లకొండ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.