ఘనంగా యుగంధర్ పుట్టిన రోజు వేడుకలు

– బండి భాస్కర్ నేతృత్వంలో ఘనంగా తుమ్మల యుగంధర్ పుట్టిన రోజు వేడుకలు
– పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ 46 వ పుట్టిన రోజును ఆదివారం బండి భాస్కర్ నేతృత్వంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల కూడలి లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి,భారీ బర్త్ డే కేక్ కట్ చేసి ఘనంగా పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు నడుమ నిర్వహించారు. వైద్య విద్య చదివిన యుగంధర్ ఇప్పటి వరకు వ్యవసాయ,వ్యాపారాలు వరకే పరిమితం అయ్యారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడం తండ్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి మంత్రి కావడంతో ఇప్పుడిప్పుడే రాజకీయాలు పట్ల మొగ్గు చూపడంతో పలు సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తుమ్మల అనుచరులు,కాంగ్రెస్ శ్రేణులు,యుగంధర్ అభిమానులు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి,సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, నారాయణపురం పి.ఎ.సి.ఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, నిర్మల పుల్లారావు,మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, ఎంపీటీసీలు వేముల భారతి,సత్యవరుపు తిరుమల బాలగంగాధర్,అశ్వారావుపేట పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ లు సత్తెనపల్లి వెంకటేశ్వరరావు,బత్తిన పార్ధసారధి,నాయకులు ఆలపాటి రాంమోహన్ రావు(రాము),సుంకవల్లి వీరభద్రరావు,మొగళ్ళపు చెన్నకేశవరావు, జూపల్లి ప్రమోద్,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,తుమ్మ రాంబాబు నార్లపాటి రాములు,పాలవలస జీవన రావు,ముళ్ళపూడి చలపతి రావు,సింహాద్రి ప్రసాద్, కాసాని మురళి,పద్మ శేఖర్,నార్లపాటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.