ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఘనంగా ఆదివాసీ దినోత్సవంనవతెలంగాణ-కాగజ్‌నగర్‌
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని డాడానగర్‌ చౌరస్తాలో ఉన్న కుంరంభీం విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు భీం విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ్‌ అబ్రహం, సభ్యులు తాజుద్దీన్‌, నర్సయ్య, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లి రాజయ్య, సభ్యులు నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.