కాటారం మండల కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా బి ఎస్ పి మంథని నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు రాజబాబు, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ మాట్లాడారు సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలేని అన్నారు ఈ కార్యక్రమం లో తుడుం దెబ్బ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈసీ మెంబర్ దయ్యం పోచయ్య, ఆటో యూనియన్ నాయకులు మారపాక వెంకట స్వామి,రవీందర్,రాజయ్య పాల్గొన్నారు.