వేడుకగా బిబిజి అవార్డుల ప్రధానోత్సవం

హైదరాబాద్‌: మహిళా అభ్యున్నతితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మిస్‌ ఇండియా మానస వారణాసి తెలిపారు. బిల్డింగ్‌ బ్లాక్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ‘జయహౌ వనిత’ పేరుతో బిబిజి 449వ టాలెంట్‌ ఫ్యాక్టరీ అవార్డుల ప్రదానోత్సవం నార్సింగిలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. మానస వారణాసి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఈవెంట్‌లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.