
బెల్లి లలితక్కగారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భువనగిరి పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద లలితక్క కుమారుడు సూర్యప్రకాష్ ఆద్వర్యంలో వర్ధంతి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు గానకోకిల స్వర్గీయ బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమంలో గద్దర్,గాదె ఇన్నయ్య ప్రముఖులతో పాటు పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉద్యమం వైపు నడిపించడంలో కీలక భూమిక పోషించడం మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం ఇలాంటి ఉద్యమం నాయకురాలి విగ్రహాన్ని త్వరలోనే భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎమ్మెల్యే తో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్ మాట్లాడుతూ లలితక్క జయంతి,వర్దంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ కార్యక్రమంలో నాయకులు భువనగిరి జెడ్పిటిసి బీరు మల్లయ్య, పోత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, తంగళ్ళపల్లి రవికుమార్, బట్టు రామచంద్రయ్య, ముక్క జాగృత్,వడిచర్ల కృష్ణ,ఊదూరి సతీష్, మల్లారెడ్డి, హామీద్,పూస శ్రీను,యాదవ్ సంఘం నాయకులు పుట్ట వీరేష్,అవిశెట్టి రమేష్, కొత్తపల్లి ఆనంద్,తుమ్మేటి వెంకటేష్,జన్ని వెన్నెల,కావలి యాదయ్య, మర్రి పాండు,పర్వతం దశరథ,మేకల బాలు,రాసాల దయాకర్, గుత్తి శివుడు లు పాల్గొన్నారు.