అపర్ణ 17 డిగ్రీస్‌ నార్త్‌ క్లబ్‌లో వేడుకగా క్రిస్మస్‌

హైదరాబాద్‌ : ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ తన 17 డిగ్రీస్‌ నార్త్‌ క్లబ్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించినట్టు తెలిపింది. లైవ్‌ కన్సర్ట్‌తో ఒక కొత్త వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 17 డిగ్రీస్‌ నార్త్‌ క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆపరేషన్స్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ క్లబ్‌ కేవలం మరో రొటీన్‌ క్లబ్‌ కాదని.. కొత్త జీవన విధానానికి నాంది అన్నారు. అత్యంత ప్రముఖ వ్యక్తులతో జాగ్రత్తగా ఏర్పాటుచేసిన కమ్యూనిటీ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్టు వివరించారు.