డాక్టర్ సి నా రే 93వ జయంతి వేడుకలను సోమవారం వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ప్రధాన కార్యాలయం వేములవాడ నందు డాక్టర్ సి నారాయణరెడ్డి 93వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ముందుగా కళాకారులు అందరు కలిసి డా సీ నా రే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కళాకారులు డా సి నా రే రాసిన సినీ గీతాలను ఆలపించారు. అనంతరం కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు యేల్ల పోశెట్టి మాట్లాతు హనుమాజీపేట ముద్దుబిడ్డ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా సి నారాయణరెడ్డి కానీ కొనియాడారు. డా సి నా రే జయంతి వర్ధంతి వేడుకల కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున నిర్వహించలని, సి నా రే పేరుతో అవార్డులను ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరారు. సినారే కళామందిరాన్ని పునర్నిర్మాణం చేయుటకు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషి చేసి కళామందిరాన్ని పునర్నిర్మాణం చేసి అందులో విగ్రహాన్ని ఏర్పాటు కొరకు కృషి చేయాలని అన్నారు. ఈ ప్రాంత కళాకారులకు వేదిక లేక కళా ప్రదర్శనలు నిర్వహించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయకులు తెల్లం మురళి, మధు, చైర్మన్ బొజ్జ కనకయ్య, కళాకారులు నేరెళ్ల తిరుమల గౌడ్, పూడూరు సంజీవ్, బొడ్డు రాములు, సావన పల్లి శ్రీనివాస్, వారాల దేవయ్య, మానువాడ లక్ష్మీనారాయణ, వెంపటి సంతోష్ , కనపర్తి హనుమాన్లు, సోమినేని బాలు, గంగా శ్రీకాంత్, బుర్రి శంకరయ్య, గుమ్మడి రాజేశం గౌడ్, మిద్దె వినీత్, వెదురు రవి, అన్నారపు హరీష్, మామిండ్ల సత్తయ్య, ఎర్ర రవిరాజ్, చి లుముల రమేష్ చారి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.