ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Celebrating Indira Gandhi's birth anniversaryనవతెలంగాణ – మోర్తాడ్ 

మండల కేంద్రంలోని ప్రజానీలయంలో మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశానికి సేవలందించిందని కొనియాడుతూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసే జయంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు, అశోక్, గంగాధర్, శ్రీధర్, ప్రవీణ్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.