ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, ఎక్కటి రఘుపాల్ రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, పోతుల నర్సయ్య, నీల కుమారస్వామి, చెకబండి శ్రీనివాస్ రెడ్డి, పైడిమల్ల శ్రీనివాస్, కర్ర కొండల్ రెడ్డి, కర్ర రాంగోపాల్ రెడ్డి, మర్రి స్వామి యాదవ్, రామగుండం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.