ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

నవతెలంగాణ -తాడ్వాయి :
రాష్ట్ర పురపాలక శాఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకొని, రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నూశెట్టి రమేష్, మాజీ సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, జాజ చంద్రం, మాజీ ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, నాయకులు వసంతరావు, రఫీ, శేషగిరి అన్నపూర్ణ రాజు, సోలం రాము తదితరులు పాల్గొన్నారు.