ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ- తిరుమలగిరి 
తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆసుపత్రులలో  రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు.  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులనే మేము చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. కచ్చితంగా ప్రజలు చూస్తూ ఆలోచిస్తున్నారని, ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయని అన్నారు, టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో మంచి స్పందన ఉన్నదని కచ్చితంగా 2029 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం, మళ్లీ కేసీఆరె  ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, జిల్లా నాయకులు దూపటి రవీందర్, మోడెపు సురేందర్, నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు, కందుకూరి ప్రవీణ్, ఆనగందుల మల్లేష్, ఎర్ర శ్రీనివాస్ దయా యాదవ్, కొర్ణ  ప్రవీణ్, అడ్డబొట్టు చారి, త్రిశూల్ , స్వామి తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.