నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్ తాండూరు నియోజకవర్గం నాయకులతో కలిసి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, బీఆర్‌ఎస్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాజకీయ ప్రముఖులు, అభిమానులు మధ్య పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో మరిన్ని సంవత్సరాలు కేటీఆర్ కొనసాగాలని, ఇంకా పెద్ద పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రాజుగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, బషీరాబాద్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు నర్సిరెడ్డి, పార్టీ తాండూర్ మండలాధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సలీం, మమ్మద్ యునస్, రాజన్ గౌడ్, గుండప్ప, శరణబసప్ప, శ్రీధర్, ప్రశాంత్ గౌడ్, ఆర్‌సీ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, ఇంతియాజ్ బాబా, మమ్మద్ మోయిస్, మహమ్మద్ సోయల్, మహమూద్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ జన్మదిన వేడుకలకు దూరంగా పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
తాండూర్ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు భారీ సంఖ్యలో గౖెెర్హజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు తాండూర్ మున్సిపల్‌లోని వివిధ వార్డు కౌన్సిలర్లకు సమాచారం ఉన్నప్పటికీ పలువురు మెజార్టీ కౌన్సిలర్లు కేటీఆర్ జన్మదిన వేడుకలకు రాకపోవడంతో గుసగుసలు మొదలయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింహులుతో పాటు మెజార్టీ కౌన్సిలర్లు కూడా బీఆర్‌ఎస్ బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్‌కు వచ్చినప్పుడే కొందరు కౌన్సిలర్ నామమాత్రంగా వస్తూ ఉన్నారు. బర్త్డే వేడుకల్లో పాల్గొనాలని సమాచారం ఉన్నప్పటికీ మున్సిపల్ మెజార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో వీరందరూ బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటారా లేదా కాంగ్రెస్ గూటికి చేరుకుంటారా అని గుసగుసలు మొదలయ్యాయి.