నవతెలంగాణ – హాలియా
అనుముల మండలం లోని చల్మారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు జాతీయ సైన్స్ దినోత్సవం సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ కు సంబంధించిన క్విజ్ పోటీలు, వక్తృత్వ మరియు వ్యాసరచన, సైన్స్ రంగోళీ పోటీలను ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన వారికి ప్రధానోపాధ్యాయులు దాసా వెంకన్న చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు దాసా వెంకన్న మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం పెంచుకొని నూతన ఆవిష్కరణలు చేసేందుకు విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆకురాతి అమృతయ్య, మందా సైదులు రావు గౌతమ్, తుమ్మకొమ్మ రామకృష్ణ, వడ్త్యా సునీత, గారపాటి శ్యామలదేవి, తీగల మల్లికార్జున్, కొరేపాక చంద్రకళ, మరియు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.