ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు  

– భువనగిరి అధికార ప్రతినిధి ఎండి. షరీఫ్
నవతెలంగాణ – చండూర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 101వ జయంతి వేడుకలు చండూరు మున్సిపల్ పట్టణంలో భువనగిరి అధికార ప్రతినిధి ఎండి. షరీఫ్ ఆధ్వర్యంలో  పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు   వేసి,  ఘనంగా నివాళులు అర్పించారు.. అనంతరం  కేక్ కట్ చేసి  స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన   చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ    మండల సలహాదారుడు బోడ బిక్షం, మండల ఉపాధ్యక్షుడు అబ్బన బోయిన   అంజయ్య, పట్టణ అధ్యక్షులు గంటా అంజయ్య,అనిల్ కుమార్, చామలపల్లి గ్రామ శాఖ  అధ్యక్షుడు జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.