ఘనంగా ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు..

Grand celebration of Odde Obanna Jayanti..నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి గ్రామంలో ఉన్న ఒడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వడ్డె ఓపెన్ గా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, వినోద్ గౌడ్, రమేష్ రెడ్డి, రాజు, వడ్డె సంఘం అధ్యక్షులు రాజ్యం, సంఘం సభ్యులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.