భీంగల్ మండలం జాగిర్యాల గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని, పరాక్రమ్ దివస్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. ఈ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటానికి అతని కృషి, అంకితభావాన్ని గుర్తు చేస్తుంది. ఆయన 128వ జయంతిని జరుపుకుంటున్న వేళ, ఆయన బోధనలను, విలువలను స్మరించుకుని, వాటిని మన జీవితాల్లో చేర్చుకునేందుకు కృషి చేద్దాం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏఈఓ దివ్య, మాజీ సర్పంచ్ మానస శ్రీను, మాజీ ఎంపీటీసీ సుమలత రాజేశ్వర్, విడిసి సభ్యులు, యూత్ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.