ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుంకట రవి మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోరే రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి తక్కురి దేవేందర్, నాయకులు బుచ్చి మల్లయ్య, పాలెపు నరసయ్య, వేముల గంగారెడ్డి, ఉట్నూరి ప్రదీప్, వేములవాడ జగదీష్, దూలూరి కిషన్ గౌడ్, నిమ్మ రాజేంద్రప్రసాద్, సింగిరెడ్డి శేఖర్, సుంకేట శ్రీనివాస్, బోనగిరి భాస్కర్, సంపంగి నాగరాజు, నరేష్, క్రాంతి, రాజేష్, అజ్మత్ హుస్సేన్, సుంకరి గంగాధర్, నల్ల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.