
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ యువ నాయకుడు పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ 54 వ జన్మదిన వేడుకలను బుధవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ కౌన్సిలర్స్ సరోజన, పున్నసది లావణ్య, ఎం.డి హసన్, మడప యాదవ రెడ్డి , వెన్న రాజు, బొంగుని శ్రీనివాస్, బూరుగు కిష్ట స్వామి తదితరులు పాల్గొన్నారు.