ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

– కేక్ కట్ చేసి మిఠాయి తినిపించిన ప్రభుత్వ విప్ ఆది..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలోని రాజన్న దేవాలయం ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం పట్టణ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశంలో ఒకవైపు మతం,ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలను చూస్తున్న బీజేపీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి ముంబయి వరకు వారు చేసిన భారత్ జూడో యాత్ర ద్వారా దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బిజెపిని తక్కువ సీట్లకే పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాడేల ఇతర పార్టీలపై ఆధారపడేలా చేశారన్నారు.గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి  ప్రధానమంత్రి అవకాశం వచ్చిన చేపట్టలేదన్నారు, దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.రాజన్న ఆశీస్సులతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ ,ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పుల్కం రాజు, చిలక రమేష్, తోట లహరి, రజాక్, పాత సత్యలక్ష్మి, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.