భక్తి శ్రద్ధలతో షబ్‌ ఎ బరాత్‌ వేడుకలు

నవతెలంగాణ-ఆమనగల్‌
ఆమనగల్‌, కడ్తాల్‌ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో షబ్‌ ఎ బరాత్‌ పర్వ దిన వేడుకలను ఆదివారం రాత్రి ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆమనగల్‌ పట్టణంలోని జామా మస్జిద్‌లో వాహెద్‌ మౌలానా, హమ్దె హిలాల్‌, మహమ్మదీయ మస్జిద్‌ల్లో స్థానిక మౌలానాలు, అదేవిధంగా కడ్తాల్‌ మండల కేంద్రంలోని మస్జిద్‌ ఖుబా, మస్జిద్‌ అర్షద్‌ల్లో ఇమామ్‌లు జహిరుద్దిన్‌, ముహమ్మద్‌ తాజిబ్‌ల ఆధ్యర్యంలో నమాజ్‌ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రంతా జాగరణ చేసి ఖురాన్‌ పఠనం గావించారు. ప్రపంచంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంట అభివృద్ధి చెందాలని అల్లాని ప్రార్ధించారు. షబ్‌ ఎ బరాత్‌ సందర్భంగా మస్జిద్‌ కమిటీల ఆధ్యర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడ్తాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మస్జిద్‌ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌ రవూఫ్‌, అహమద్‌ జాని ఉపాధ్యక్షులు జావిద్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యులు జహంగీర్‌ బాబా, అశ్రఫ్‌, అబ్దుల్‌ వహాబ్‌, ఆసిఫ్‌ అలీ, ఇర్షాద్‌, షకీల్‌, అనీస్‌, మహబూబ్‌ ఆలి, యూనుస్‌ పాల్గొన్నారు.