నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
అంజనీలో జెండా ఆవిష్కరణ చేసిన యువకులు మండలంలోని పెద్దకొడప్ గల్,అంజని గ్రామాలలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద జెండా ఆవిష్కరించి గ్రామ వీధుల్లో భారీ బైక్‌ర్యాలీ, శోభాయత్ర నిర్వహించారు. ఈ సందర్భగా పలువురు మట్లాడుతూ.ముస్లిం రాజ పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చోరువతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందన్నారు. తన తల్లి జీజీయ బాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత, విస్తరణ కోసం బీకర మైన యుద్ధాలు చేసి ముస్లింల రాజుల నుంచి హిందు వులను కాపాడిన ఘనత శివాజీదే అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, హనుమాన్ సేవాసమితి,విశ్వహిందూ పరిషత్, కార్యకర్తలు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఎస్సై కోనారెడ్డి,సొసైటీ డైరెక్టర్ సాయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.