ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం కౌలాస్ లో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగ నిర్వహించారు. చారిత్రక రామ మందిరం లో బుధవారం శ్రీ రామ జన్మ దినం ఘనంగా నిర్వహించారు. పురోహితులు శ్రీ చంద్రకాంత్ మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం నుండి భజనలు కీర్తనల తో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. రాముని జన్మదినం సందర్భంగా డోళయమనం ఊయల లో ఉత్సవ మూర్తిని ఉంచి మహిళలు పాటలు పాడుతూ భజనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు అనిత సింగ్, ఉమకంత్ దేశాయ్,అక్షత్ రాజా,  తాజమాజీ సర్పంచ్ హన్మాండ్లు, పకల వెంకటి,    భజన సంఘం నాయకులు విఠల్, బోడ సాయిలు, కలై నారాయణ, వీరెష్ పటేల్, హన్మగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఉదయం మహిళల ఊరేగింపు భజన ఆకర్షించింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా లాడేగాం గ్రామములో రాజ శేఖర్  పటేల్ అద్యక్షతన గ్రామస్తులు,  యూత్ సంఘం సబ్యులు  అధ్వర్యంలో హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులు కలిసి ప్రత్యేక పూజలు, కీర్తనలు, భజనలు, సప్తహ నిర్వహించారు. ప్రత్యేకంగా మహఅన్నదానం నిర్వహించారు. మహిళలు పెద్గలు భారీసంఖ్యలో పెద్దలు ఎంపిటిసి విజయ, మాజీ సర్పంచ్ ఆశ్వీనిపటేల్, తదితరులు పాల్గోన్నారు.