ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

నవతెలంగాణ – ఆర్మూర్
శ్రీ రామనవమి సందర్బంగా పట్టణంలోని సిద్దులగుట్ట లో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మున్సిపల్ ఛైర్ పర్సన్  లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, డీసీసీ ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు  నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, సీనియర్ నాయకులు పిప్పర సాయిరెడ్డి మాజీ లిఫ్ట్ చైర్మన్ భోజరెడ్డి నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పిరాజీ నాగరాజ్,  పట్టన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, వై యస్ గంగాధర్,GR రాజేందర్, శ్రీనివాస్ అగర్వాల్, కండె కిరణ్, మన్నే సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
స్థానిక ఎమ్మెల్యే  పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు గల నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. సిద్దుల గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు మోయడం జరిగింది. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చే ప్రత్యేక పూజలు చేయించారు. మండలంలోని గోవింద్ పెట్ లో సీత రాముల కళ్యాణం లో పాల్గొన్నారు. పిల్లలకు ఇచ్చే సంస్కృతి మనల్ని కాపాడుతుందని  అతి గొప్ప ధర్మం హిందూ ధర్మం అని అన్నారు. మండలంలోని కమన్ పల్లి, పీప్రి, మంథని, దెగం,మాచర్ల గ్రామంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లి కన్వీనర్ పాలెపు రాజు,కంచేట్టి గంగాధర్,కళిగొట్ గంగాధర్,రోహిత్ రెడ్డి ,మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.