అంబరాన్నంటిన ఎమ్మెల్యే జన్మదిన సంబరాలు

– విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్, గిరిజనులకు దుప్పట్లు పంపిణీ
– బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్న నాయకులు
నవతెలంగాణ – రాయపర్తి
పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పూల గుచ్చాలు, శాలువాలతో ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు.. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. తదుపరి జింకురం తండాలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతానని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అన్నారు. రాయపర్తి మండల ప్రజల ఆదరాభిమానాలను ఎల్లప్పుడూ మరువనని తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పాలకుర్తి ఆలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఉలేంగుల నర్సయ్య, యాదగిరి, గబ్బేట బాబు, బొమ్మెర కళ్యాణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, పెండ్లి మహేందర్ రెడ్డి, వల్లపు కుమార్, చిర్ర మల్లయ్య, మచ్చ నిల్లయ్య, మచ్చ రమేష్, పిరని ప్రవీణ్, చెడుపాక వెంకటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.