బైంసా మండలంలోని ఇలేగాం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసులకుప్రభుత్వం మరింత సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేపట్టి నాయక్ పోడ్ లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయక్ పోడ్ సంఘం అధ్యక్షులు అల్లకొండ మహేష్, ఉపాధ్యక్షులు కందరి రాజు, నాయకులు ఎర్రం నరేష్, సిరం సాయినాథ్, కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.