ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకల్లో భాగంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూన్నట్ పుట్టినరోజు వేడుకలు సోమజిగూడ రాష్ట్రపతి భవన్లోని సంస్కృతి భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ చైర్మన్ మరియ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ గవర్నర్ శ్రీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ జాయింట్ సెక్రెటరీ ఆఫ్ రాజ్భవన్ భవాని శంకర్, సెక్రటరీ రఘు ప్రసాద్ గౌడ్ వేదికనలంకరించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి, సిపిఆర్ కన్వీనర్ డాక్టర్ విజయ భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి, క్యాంప్ కో కన్వీనర్ కల్పనా దత్త గౌడ్ ఎంసీ నెంబర్ జ్యోతి, స్వర్ణ రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ లక్ష్మి, ప్రసన్న,, లీలావతి, డా శ్రీ పూజ, డా. విష్ణు గౌడ్, పవన్, అభిషేక్, రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.