నవతెలంగాణ ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపొందడంతో ఆదివారం విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించినారు. మాణిక్ బండార్ నుండి మొదలైన ర్యాలీ రహదారి ద్వారా అంకాపూర్ వరకు కొనసాగింది. ఆయన స్వగ్రామం అయిన అంకాపూర్ లో , పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లిలలో నాయకులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు నిర్వహించినారు.