నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల జారీ చేయడంపై మండల పరిధిలోని వీరాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు మంగళవారం సంబురాలు నిర్వహించారు. వీరాపూర్ గ్రామాన్ని ప్రభుత్వం పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి పారదర్శకంగా పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం హర్షనీయమని కాంగ్రెస్ నాయకుడు మిట్టపెల్లి చెన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటానికి చెన్నారెడ్డి పలువురు గ్రామస్తులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పలువురు రైతులు పాల్గొన్నారు.