
వీర వనిత చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు పూలమాలను వేసి నివాళులర్పించడమైనది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్ ర్సన్ అయ్యప్ప శ్రీనివాస్, బిజెపి అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ.. “భూమికోసం, భుక్తి కోసం — వెట్టి చాకిరి విముక్తి కోసం” ” తెలంగాణ స్వతంత్రం కోసం – రజాకారులను తరమడం కోసం” బట్టలను బండపై ఉతకడమే కాదు అవసరమైతే కొడవలి పట్టి ఓ పులిలా రజాకారులను ఎదిరించినటువంటి ధీర వీరవనిత చాకలి ఐలమ్మ అని, చాకలి ఐలమ్మ పేరును కోటి లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ న్నామని, పేరు పెట్టగానే అక్కడ పరిస్థితులు మారవని మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి మహిళలు చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని ఆ ధీరవనిత మాదిరిగా ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం విజ్ఞానవంతులై ముందుకు వచ్చిన నాడే చాకలి ఐలమ్మకు నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, కౌన్సిలర్లు చాలా ప్రసాద్, ఆకుల రాము ,చందు తదితరులు పాల్గొన్నారు.