మోపాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంబరాలు

నవ తెలంగాణ- మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మోపాల్ మండల అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్, ఎంపీపీ లతా కన్నీరం, జడ్పిటిసి కమలా నరేష్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేతుల మీదగా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరోసారి బీఫామ్ అందుకున్నాడు అలాగే ఆదివారం రోజున బారాస పార్టీ  సంబంధించిన మేనిఫెస్టో సీఎం కేసీఆర్ భరాసా కార్యాలయంలో ప్రకటించాడు. దాని సందర్భంగా మండల కేంద్రంలో బాణ సంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం పరిచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ కచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి బాజిరెడ్డి గోవర్ధన్ నీ గెలిపించుకుంటామని హ్యాట్రిక్ విజయం అందిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే టైగర్ గోవన్నను తట్టుకునే శక్తి మిగతా పార్టీలకు లేదని   గోవన్న మీద పోటీ చేయడం అంటే మైసమ్మ తల్లికి పొట్టేలును బలి ఇచ్చినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. కచ్చితంగా ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గోవర్ధన్ గెలిపించుకుంటామని ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా రానివ్వమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ముత్యంరెడ్డి , క్యాతం రవి, సిద్ధార్థ, పరశురాం చైర్మన్ లు ఉమాపతిరావు, నిమ్మల మోహన్ రెడ్డి  నాయకులు కెంపు భూమయ్య ఎంపీటీసీ ముత్తెన్న, రమేష్ తదితర భరస కార్యకర్తలు పాల్గొన్నారు.