జిల్లాకు విచ్చేసిన విజయోత్సవ సంబరాల అసెంబ్లీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అర్కాల నర్సారెడ్డి బుధవారం పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఏడాది పాలన సంబరాలు జరుపుకున్నారు. తర్వాత క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి జైకొడుతూ ర్యాలీ చేపట్టారు. ఈ సంబరాలలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి, ఐఎన్టియూసీ జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్, సంద నర్సింగ్ పాల్గొన్నారు.