ధర్మాజీపేటలో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

నవతెలంగాణ-దుబ్బాక
కాంగ్రెస్‌ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌ రెడ్డిని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం దుబ్బాక పురపాలిక పరిధిలోని ధర్మాజీపేట వార్డులో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ దుబ్బాక మున్సిపల్‌ అధ్యక్షుడు నర్మెట ఏసురెడ్డి మాట్లాడుతూ, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ కేటాయించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ,కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రేవంత్‌ రెడ్డిలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి దుబ్బాక గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని, చెరుకు శ్రీనివాస్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. దుబ్బాక మున్సిపల్‌ యూత్‌ అధ్యక్షుడు బురాని శ్రీకాంత్‌, ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌,సోషల్‌ మీడియా ఇన్చార్జ్‌ కర్ణంపల్లి రమేష్‌ గౌడ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాస మధు, నాయకులు ఎల్లయ్య, నస్కంటి నర్సింలు, తుపాకి స్వామి, శివరాజం గౌడ్‌, బత్తుల నాంపల్లి, బురాని ప్రసాద్‌, తలారి రవి, గట్టు బాబు, శశి, విజరు కు మార్‌, ఫుల్లూరి రాములు పలువురు పాల్గొన్నారు.