వరంగల్ డిక్లేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. డిజె చప్పులతో, బాణ సంచాల మోతలతో అంబరాన్నంటేలా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులు, మహేందర్ రెడ్డి, మాచర్ల ప్రభాకర్, సరికొండ కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉల్లంగల నర్సయ్య, ఉల్లంగల యాదగిరి, సుదర్శన్ రెడ్డి, ఈరెడ్డి నరసింహారెడ్డి, గబ్బెట బాబు, మచ్చ రమేష్, నరసింహమూర్తి, ఎండి ఉస్మాన్, ఆఫ్రోస్ ఖాన్, కళ్యాణ్, జలగం యాకయ్య, పిరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.