ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలు..

Celebrations of Milad Un Nabiనవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వారు ఊరేగింపు జరిపారు. ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యత, తెలియజేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొన్న పవిత్ర దినమని వారు పేర్కొన్నారు. సోమవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన అనంతరం ప్రార్ధన మందిరంలో వారు ప్రత్యేక నమాజులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు అజ్గర్ అలీ, ఇస్మాయిల్, అప్సర్, షౌకత్ అలీ, మహబూబ్, అజ్మత్, ఇబ్రహీం, అక్బర్, సలీం వాజిద్, తదితరులు పాల్గొన్నారు.