
దుబ్బాక మండలం పద్మనాభుని పల్లి గ్రామంలో ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు సాగర్, స్వామి చరణ్ మాట్లడుతూ తెలంగాణ సమాజం మూలాన్ని మర్చిపోయిందని గుర్తు చేశారు. జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణని సాధించేందుకు పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు.జయశంకర్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఏ ఏ రంగాల్లో తెలంగాణను వివక్షతకు గురి చేస్తున్నారనే విషయాల గురించి అధ్యయనం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ప్రదాత అని తన గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఫ్రొఫెసర్ జయ శంకర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్వామి చరణ్, ప్రవీణ్, నవీన్, శ్రీనివాస్, కనకరాజు, బొమ్మ స్వామి, శ్రీధర్, సందీప్, మండల ప్రవీణ్, నవీన్, నందు, తదితరులు ఉన్నారు