ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్ర పటానికి యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్ పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ, ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.