
మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 73 వ జయంతి వేడుకలను మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పివి రావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. పివి రావు ఆశయ సాధన కోసం పని చేస్తామని తెలిపారు. ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రాణాలను పెట్టి ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయనకు యావత్ మాల జాతి రుణపడి ఉంటుందని అన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య ఆధ్వర్యంలో పివి రావు ఆశయ సాధన కోసం బలంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు రొయ్య కిరణ్, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లకుమాల లింగయ్య, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు చింతమల్ల పాండురంగయ్య, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు పెంటమల్ల జంగయ్య, కాశమ్మల్ల నరేష్, సృజన్, తదితరులు పాల్గొన్నారు.