ఘణంగా సేవాలాల్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పలు గ్రామాలలో సేవాలాల్ 2 వందల 85వ జయంతి వేడుకలను గిరిజన సోదరులు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా సావర్ గావ్ తాండా లో సేవాలాల్ యూత్ సబ్యులు, మథురా తాండా, దోస్పల్లి తాండా,  మాజీసర్పంచ్ సంజీవ్ చౌహన్ , మహమ్మదాబాద్ తాండాలో ఇటుక బట్టి జాదవ్ రాజు, లలో సేవాలాల్  చిత్ర పఠానికి పూలమాల వేసి ఘణంగా సన్మానించారు. అనంతరం గిరిజన యువతులు సంప్రదాయనుకులంగా నృత్యాలు, సందడి చేసాయి. ప్రత్యేక పూజలనిర్వహించిన అనంతరం వచ్చిన అథితులకు అన్నప్రసాదం నిర్వహించారు. సంత్ సేవాలాల్  అందరికి అరాద్యుడని, గిరిదనుల దశ దిశ ను చూపిన గొప్ప మహనీయుడని మహమ్మదాబాద్ జాదవ్ రాజు తెలిపారు. కార్యక్రమంలో దోస్పల్లి జీపీ కార్యదర్శి జావ్ మనోహర్, గిరిజన యువజన సంఘం నాయకులు, లంబాడీ మహిళలు తదితరులు పాల్గోన్నారు.