ఘనంగా శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాలు..

– పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
– భక్తులతో కిక్కిరిసిన ఆలయం
నవతెలంగాణ – తాడ్వాయి 
తాడ్వాయి మండలం సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభులింగాన్ని దర్శించుకుని భక్తులు పునీతులవుతారు. మండలంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల మండలాలు అయిన కామారెడ్డి, సదాశివ నగర్ ,భిక్కనూరు, లింగంపేట, గాంధారి ,నాగిరెడ్డిపేట ,మెదక్, ఎల్లారెడ్డి మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక వరుసల్లో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు. ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు భీమేశ్వర వాగు ప్రవహిస్తునడంతో ఈ వాగులో మాఘ అమావాస్య సందర్భంగా స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తారు అందుకోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వాగులో మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక స్నానాలు ఆచరిస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.
 కృష్ణాజివాడి, చిట్యాల లో ప్రత్యేక ఉత్సవాలు
మండలంలోని కృష్ణాజివాడి, చిట్యాల గ్రామాల్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు .ఈ ఆలయాలకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు  సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆవరణలో, చిట్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు .భక్తులు ప్రత్యేక అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారు.శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో వారు ప్రత్యేక బస్సులను నడిపించారు. ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి శ్రీ భీమేశ్వర స్వామి జాతరలో ఆయన ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన భక్తులకు ఉచితంగా కంటి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలోసంతాయిపేట భీమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాపురెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్,రాజేశ్వర్ రావు ,సతీష్ కృష్ణమోహన్, రాజిరెడ్డి, రాజేశ్వరరావు, శ్రీనివాస్ ,భాస్కర్ ,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే
తాడ్వాయి మండలం ని శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్మోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ భీమేశ్వర స్వామి దట్టమైన అరణ్యంలో కొలువు తీరాడని తెలిపారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వివరించారు. అంతకుముందు ఆయన కృష్ణాజివాడిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దర్శించుకుని పూజలు నిర్వహించారు.