ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
పదవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్‌ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, ఎంపీటీసీ రాంపల్లి కష్ణ, రాసాల మల్లేష్‌ యాదవ్‌,రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ కంచి మల్లయ్య, ఎంపీడీవో నరేందర్‌ రెడ్డి, ఎంపీ ఓ అనురాధ దేవి, ఏపీవో బాలస్వామి, పి ఆర్‌ ఏ ఈ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. వాడ యిగూడెం గ్రామంలో సర్పంచ్‌ గుండు మనిష్‌ కుమార్‌ గౌడ్‌, చందుపట్ల గ్రామంలో చిన్నం పాండు, నాగిరెడ్డిపల్లి గ్రామంలో జక్క కవిత రాఘవేందర్‌ రెడ్డి, వడపర్తి గ్రామంలో ఎలిమినేటి కష్ణారెడ్డి, బండ సొమరం గ్రామంలో నానం పద్మకష్ణ గౌడ్‌, వీరవల్లిలో తంగళ్ళపల్లి కల్పనా శ్రీనివాస చారి, నమాత పెళ్లిలో ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్‌, నందనంలో కడమంచి ప్రభాకర్‌, బోలేపల్లి గ్రామంలో బుచ్చిరెడ్డి, సిరివేణి కుంట గ్రామంలో పడాల అనిత వెంకటేష్‌, ముత్తిరెడ్డి గూడ గ్రామంలో మాకొల్‌ సత్యం యాదవ్‌, తుక్కాపూర్‌ గ్రామంలో నోముల పద్మ మహేందర్‌ రెడ్డి, గౌస్‌ నగర్‌ గ్రామంలో ఈర్ల పుష్పమ్మ కష్ణ, చీమల కొండూరు గ్రామంలో జిలుగు కవితా సతీష్‌ పవన్‌, ముస్తాల పెల్లిలో యాదగిరి, మన్నె వారి పంపు గ్రామంలో బోయిని పాండు జాతీయ జెండాలను ఆవిష్కరించగా, చందుపట్ల పి ఎస్‌ సి ఎస్‌ బ్యాంకులో చైర్మన్‌ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ ఎలిమినేటి మల్లారెడ్డి, స్వచ్ఛంద సంస్థల నాయకులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో
మండలంలోని చందుపట్ల గ్రామంలో కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నం వెంకటేష్‌ అధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ బ్యాంకు చైర్మెన్‌ మందడి లక్ష్మి నర్సింహ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ ఎలిమినెటి మల్లారెడ్డి , మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరికొండ శివకుమార్‌, బ్యాంకు డైరెక్టర్లు, గ్రామస్తులు, మల్లారెడ్డి సిరికొండ వెంకటేష్‌ ,తోటకూర పరమేష్‌, వల్లపు నరసింహ, గౌర మధు, చీరకంటి సురేష్‌, జూపల్లి లక్ష్మణ్‌, చిన్నం ధని, తోటకూరి బాలరాజు, తాడూరు సత్తి, జెట్టి వెంకట్‌ రెడ్డి, జమ్మూల కూమర్‌ పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండల, మున్సిపాలిటీలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ముందు ఆర్డిఓ వెంకట ఉపేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌ రెడ్డి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణ కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం ముందు ఆ పార్టీ మున్సిపల్‌ , మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌ రెడ్డి, గిర్కటి నిరంజన్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పట్టణ కేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో జడ్జి మహాతి వైష్ణవి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భాస్కర్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గోపగోని లక్ష్మణ్‌, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, బండమీది మల్లేశం, అంతటి విజయలక్ష్మి , సుల్తాన్‌ రాజు, ఆలే నాగరాజు, కామిశెట్టి శైలజ, ఎండి బాబా షరీఫ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వాకిటి నరసింహారెడ్డి, జనరల్‌ సెక్రెటరీ పాల రమేష్‌, న్యాయవాదులు తడక మోహన్‌, ఉడుగు శ్రీనివాస్‌ గౌడ్‌, బాల్యం వెంకటాచలపతి, భిక్షం, తాడూరి పరమేష్‌, ఎండి ఖయ్యూం, శ్రీకాంత్‌, నాగరాజు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు
రాజాపేట: మండల కేంద్రంలో స్వామి వివేకానంద చౌరస్తా వద్దతెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్‌, జెడ్పీటీసీ గోపాల్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌్‌ భాస్కర్‌ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ ఉపేందర్‌, నాగిర్తి రాజిరెడ్డి, గౌటే లక్ష్మణ్‌, మేక వెంకటేశ్వర్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ ఈశ్వరమ్మ శ్రీశైలం, గోపిరెడ్డి, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి, మరల నాగరాజు,రేగు సిద్ధులు, జస్వంత్‌, వీరేశం, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
రాజాపేట మండల కేంద్రంలో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ మండల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగానిర్వహించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్‌ గౌడ్‌ ,జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు సిల్వేరు బాలరాజ్‌ గౌడ్‌, భూపతి యాదగిరి ,ఎర్రోళ్ల బాబు, విట్టల్‌ నాయక్‌, అంకతి రమేష్‌ ,రాంజీ నాయక్‌, చిమ్మి సత్యనారాయణ, రవీందర్‌ నాయక్‌ ,రంగా నరేష్‌, ఆంజనేయులు ,బాల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌ : 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో వెనుకబడ్డ తెలంగాణను తొమ్మిదేళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సహాయం అందేలా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కిందని మండల వైస్‌ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్‌, సర్పంచులు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డి ,కోటగిరి జయమ్మ ,వంగాల శ్రీశైలం ,బక్క రాంప్రసాద్‌ ,బండ పద్మ పర్వతాలు అన్నారు. శుక్రవారం మండలంలోని కొలనుపాక ,రాఘవపురం, కొల్లూరు, తూర్పు గూడెం ,శారాజపేట గ్రామాలలో గ్రామపంచాయతీ ఆవరణంలో జాతీయ జెండా ఎగరవేసి ఈ సందర్భంగా మాట్లాడారు రైతులు కార్మికులు కుల వత్తు దారులు మహిళలు మత శిశు అన్ని వర్గాలను దష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ కు ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటారని ఆశించారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ లు కంతి మహేందర్‌, పరిధి పద్మ, మామిడాల అనిత అంజయ్య, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్‌ ,తిరుమల చారి, స్వప్న ,ఇందిరా, కనకరాజు విద్యా కమిటీ చైర్మన్‌ రాజబోయిన కొండల్‌ ,నాయకులు కిష్టయ్య, మధు ,దశరథ, సురేష్‌ , రామకష్ణ, బండి రాజు నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్‌ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, వివిధ గ్రామా పంచాయతీలలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ దశరథ నాయక్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీఅంజయ్య ,జెడ్పిటిసి శ్రీరాముల జ్యోతి అయోధ్య, స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎస్సై ఉదరు కిరణ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్య అధికారి డాక్టర్‌ : ప్రవీణ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ చైర్మెన్‌్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ త్రివేణి దుర్గయ్య, మండల ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు బాలెంల విద్యాసాగర్‌, గూడపు పరమేష్‌, సీనియర్‌ నాయకులు బాలెంల సురేష్‌, పాక సింహాద్రి, మేకల జగన్‌, బాలెంల అరవింద్‌, బాలెంల నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ ఎం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో పాఠశాలలలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోతహసీల్దార్‌ జయమ్మ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగరాజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ విలియం కేరి పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ జిల్లాల శేఖర్‌ రెడ్డి జెడ్పీటీసీ పాఠశాలలో హెచ్‌ఎం టి గోపాల్‌ రెడ్డి సరస్వతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో హెచ్‌ఎం పి నర్సయ్య బ్రిలియంట్‌ పాఠశాలలో హెచ్‌ఎం పి పావని కోటేశ్వరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు బీసు చందర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ మండల పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి బీజేపీి కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జె నగేష్‌, ఎస్‌ తిరుమల్‌ రెడ్డి, బి ఉప్పలయ్య, ఎల్‌ రమేష్‌, ఎస్‌ వెంకటేశ్వర్లు, జి మాధవి మల్లేశం గౌడ్‌, కే సత్తయ్య, పి స్రవంతి శ్రీనుగౌడ్‌, ఎన్‌ నరసింహారెడ్డి, జెయాదయ్య, టీ కమలమ్మ లతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి డి పి టీ తహసీిల్దార్‌ జయలక్ష్మి ఆర్‌ఐ యాదగిరి, జెడ్పీటీసీ కె.నరేందర్‌ గుప్తా, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి ,అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెన్షనర్స్‌ ఆధ్వర్యంలో..
రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షులు గంగుల రామ్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోదాసు అంజయ్య, కోశాధికారి
సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివెంకటేశగారు, ఉపాద్యక్షులు. రంగయ్య,గోవర్ధనచారి, మన్సూర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..
మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ చిత్రపటానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కొండేటి మల్లయ్య పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సాల్వేరు అశోక్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్‌, నాయకులు సంగిశెట్టి బాబు, గురుకు శివ, మహేశ్వర అశోక్‌, మండల కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు ఎండి.ఎజాస్‌, జానీ, వనం రవీందర్‌, బోయపల్లి మల్లేష్‌, రాములు, నర్ర అండాలు, యాదయ్య, నోముల లింగస్వామి, గోశిక మీనయ్య, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు మున్సిపల్‌ కార్యాలయం లో ఏర్పాటు చేసిన జెండాను చైర్‌పర్సన్‌ ఎరుకల సుధా హేమేందర్‌ గౌడ్‌ ఆవిష్కరించారు .బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు చేసిన జెండాను పార్టీ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య ఆవిష్కరించారు .కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండాను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ బీర్లఅయిలయ్య ఆవిష్కరించారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండాను పార్టీ సీనియర్‌ నాయకులు పేరబోయిన పెంటయ్య ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ ఉద్యమకారుడు ఎరుకల హెమెందర్‌ గౌడ్‌ పూలమాలవేసి నివాళులర్పించారు.ఆయాకార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ బాలకష్ణ కౌన్సిలర్లు అరుణ రాజేష్‌ ,బూడిది సురేందర్‌ ,సీసా విజయలక్ష్మి కష్ణ దండబోయిన అనిల్‌ ,ఆవుల మమత బిఆర్‌ఎస్‌ నాయకులు శ్రీధర్‌ పాపట్ల నరహరి కాంగ్రెస్‌ నాయకులు బాలరాజు బందారపుబిక్షపతి సిపిఐ నాయకులు కల్లెం కష్ణ బబ్బురి శ్రీధర్‌ జిల్లా జానకి రాములు, పేరబోయిన మహెందర్‌ పాల్గొన్నారు
ఆలేరుటౌన్‌ : మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైల్వే గేట్‌ ఆవరణలో వివిధ కాలనీలలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుండే సంపత్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిఆలేరు పురపాలక సంఘం చైర్మన్‌ వస్పరి శంకరయ్య, గారు పురపాలక సంఘం వైస్‌ చైర్మన్‌ మొరిగాడి మాధవి వెంకటేష్‌ గౌడ్‌, పురపాలక సంఘం 3వార్డు కౌన్సిలర్‌ భేతి రాములు,6వార్డు కౌన్సిలర్‌ రాయపురం నరసింహులు,కోఆప్షన్‌ నెంబర్‌ ఎండి రియాజ్‌ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..
ఇంద్ర కాంగ్రెస్‌ భవనం నందు పట్టణ అధ్యక్షులు, ఏజాస్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో, కోర్టు ఆవరణలో, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం పీఏసీఎస్‌ కార్యాలయం ఆవరణలో జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో బీపీసీసీ కార్యదర్శి జనగామ ఉపేందర్‌ రెడ్డి, డైరెక్టర్‌ కట్టేకొమ్ముల సాగర్‌ రెడ్డి, సెల్‌ కన్వినర్‌ నీలం వెంకటస్వామి , మాజీ ఎంపీటీసీ జైనుదిన్‌,సీనియర్‌ నాయకులు ఎగ్గిడి యాదగిరి ,జిల్లా కార్యదర్శి వల్లెపు ఉప్పలయ్య,ఎగ్గిడి శ్రీశేలం ,ఎగ్గిడి మల్లయ్య,టౌన్‌ ఉపాధ్యక్షులు దాడిగే అనిల్‌,యూత్‌ కాంగ్రెస్‌ మండల్‌ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ రూరల్‌: తెలంగాణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మండలంలోని గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనాల ముందు జెండా ఆవిష్కరించారు. లింగరాజు పల్లి గ్రామపంచాయతీ పరిధిలో పబ్బు నరసింహ, గంగాదారి ఆశయ్య, గంధ మల్ల బ్రహ్మయ్య, ఉద్యమ కారులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి ఉమా కష్ణ, ఉప సర్పంచ్‌ బొడిగే రాజు పంచాయతీ సెక్రెటరీ రేణుక, వార్డు నెంబర్లు,బిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు,తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌ పోచంపల్లి : బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌ పురపాలక కేంద్రంలో మండల పరిషత్‌ మున్సిపల్‌ కేంద్రంలో రామనంద తీర్థ యూనివర్సిటీలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పార్టీ కార్యాలయంలో నేతాజీ చౌరస్తా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ విజయలక్ష్మి, బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ సుధాకర్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ విక్రం రెడ్డి ఎమ్మార్వో కార్యాలయంలో వీరాభారు గ్రామపంచాయతీలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీకోట పుష్పలత. వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తడాకా వెంకటేశం, భారత లవ కుమార్‌ ,గునిగంటి రమేష్‌ ,తదితరులు పాల్గొన్నారు.