
ఎస్సీ ఎస్టీలకు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్ప నేపథ్యంలో శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం,ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.