రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు గ్రామ రైతులు సంబురాలు చేసుకున్నారు. బుదవారం మండలంలోని ముల్లంగి (బి) గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటానికి ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం చైర్మన్ బురోల్ల అశోక్ ఆధ్వర్యంలో రైతులు క్షిరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేస్తునందుకు సంతోషంగా ఉందని హర్ష్యం వ్యక్తం చేశారు. ఇందులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఖాలిల్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.