ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ సంబరాలు

Celebrations to welcome the SC and ST classification verdict of the Supreme Courtనవతెలంగాణ –  కామారెడ్డి
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలో దళిత నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఉద్యమ ఫలితంగానే, వేలాదిమంది మాదిగ, మాదిగ  ఉపకులాల ఉద్యమకారులు చనిపోవడం జరిగిందన్నారు. వేలాది బస్సులు. వందలాది రైళ్లు  ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం కావడం జరిగిందనీ, దాన్ని ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు.  దీనిపై స్పందిస్తూ నిండు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి  ఈ తీర్పును మేము స్వాగతిస్తూ మాదిగ, మాదిగ ఉపకులాలకు విద్యారంగంలో , ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోవాలని వెంటనే దీనిని అమలు చేయాలని  కామారెడ్డి జిల్లా శాఖ తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, గంగాధర్, శివరాజు చింటూ, చింటూ, బాలయ్య, హైమద్, రాజలింగం పాల్గొన్నారు.